అందరికీ కనెక్ట్‌ అవుతుంది

ABN , Publish Date - Mar 17 , 2024 | 05:20 AM

క్రియేటివ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ సమర్పణలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తులసివనం’. అక్షయ్‌, ఐశ్వర్య, వెంకటేష్‌ కాకమాను, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్‌ రెడ్డి దర్శకత్వం వహించారు...

అందరికీ కనెక్ట్‌ అవుతుంది

క్రియేటివ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ సమర్పణలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తులసివనం’. అక్షయ్‌, ఐశ్వర్య, వెంకటేష్‌ కాకమాను, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ న్యూ ఏజ్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్టైనర్‌ ప్రముఖ ఓటీటీ వేదికగా మార్చి 21 నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర బృందం ట్రైలర్‌ను లాంచ్‌ చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ ‘‘సినిమా చిత్రీకరణ విషయంలో క్లారిటీ చాలా ముఖ్యం. ‘తులసివనం’లో ఆ క్లారిటీ వుంటుంది’’ అని అన్నారు. డైరెక్టర్‌ అనిల్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఇది అందరూ రిలేట్‌ చేసుకునే కథ’’ అని అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: స్వాగత్‌ రెడ్డి, నీలిత పైడిపల్లి. సంగీతం: స్మరన్‌ .

Updated Date - Mar 17 , 2024 | 05:20 AM