ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది

ABN , Publish Date - Mar 11 , 2024 | 03:22 AM

వి.రఘుశాస్ర్తి దర్శకత్వంలో త్రిగుణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘లైన్‌ మ్యాన్‌’. ఈ నెల 15న తెలుగు, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. త్రిగుణ్‌కు జోడీగా కాజల్‌ కుందెర్‌ నటించారు. శనివారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు...

ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది

వి.రఘుశాస్ర్తి దర్శకత్వంలో త్రిగుణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘లైన్‌ మ్యాన్‌’. ఈ నెల 15న తెలుగు, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. త్రిగుణ్‌కు జోడీగా కాజల్‌ కుందెర్‌ నటించారు. శనివారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు శివ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేసి ‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. మన మూలాల్లోకి వెళ్లి రాసుకునే కథలు, తీసే సినిమాలు ఆడియెన్స్‌కు ఎక్కువగా కనెక్ట్‌ అవుతాయి’’ అని అన్నారు. త్రిగుణ్‌ మాట్లాడుతూ ‘‘మనం ఇప్పుడు ఫోన్‌, టీవీ వంటి వాటికి బానిసల్లా మారాం. ఓ గంట కరెంట్‌ లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చాం. ఓ ఊర్లో పది రోజులు కరెంట్‌ లేకపోతే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా కథ’’ అని చెప్పారు. నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం సినిమా కంటెంట్‌ మారుతోంది. కథే హీరోగా మారింది. ఈ చిత్రం కూడా రియల్‌ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా తీశారు’’ అని అన్నారు. వి రఘు శెట్టి మాట్లాడుతూ.. ‘మనుషుల్లో మానవత్వం ఇంకా ఉందని చూపించే చిత్రమిది. ఇది ఒక ఊరు కథ’’ అని అన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 03:22 AM