అందరికీ రిలేట్‌ అవుతుంది

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:55 AM

‘బెంచ్‌ లైఫ్‌’ వెబ్‌ సిరీస్‌తో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు మానస శర్మ. తమిళ నటుడు వైభవ్‌, చరన్‌ పెరి, రాజేంద్ర ప్రసాద్‌, రితికా సింగ్‌, అకాంక్ష సింగ్‌...

‘బెంచ్‌ లైఫ్‌’ వెబ్‌ సిరీస్‌తో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు మానస శర్మ. తమిళ నటుడు వైభవ్‌, చరన్‌ పెరి, రాజేంద్ర ప్రసాద్‌, రితికా సింగ్‌, అకాంక్ష సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. నిహారిక కొణిదెల నిర్మించారు. ఈ శుక్రవారం ఓటీటీ సంస్థ ‘సోనీ లైవ్‌’లో విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది.


నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘ఇది కార్పోరేట్‌ ఉద్యోగుల కథ అయినా.. అందరికీ రిలేట్‌ అవుతుంది. వినోదంతో పాటు.. మంచి భావోద్వేగాలు ఇందులో ఉంటాయి. అద్భుతమైన కంటెంట్‌ ఉన్న ఈ వెబ్‌ సిరీస్‌ తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. దర్శకురాలు మానస శర్మ మాట్లాడుతూ ‘‘నేను జాబ్‌ చేస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలు.. లైఫ్‌లో చూసిన అనేక సంఘటనలను స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ ఇది. ప్రతీ పాత్రకూ ఓ కథ ఉంటుంది. ఇందులోని నటీనటులు పంచే వినోదం చాలా కాలం గుర్తుంటుంది’’ అని చెప్పారు. నటుడు చరణ్‌ పెరి మాట్లాడుతూ ‘‘స్నేహ మాధుర్యాన్ని.. అభిరుచులను సరికొత్తగా ఆవిష్కరించే సిరీస్‌ ఇది’’ అని అన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 03:55 AM