ప్రతి ఒక్కరు రిలేట్‌ అవుతారు

ABN , Publish Date - Apr 10 , 2024 | 01:46 AM

నవదీప్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్‌ మౌళి’. తనను ఇప్పటివరకు చూడని విధంగా ఆవిష్కరించే చిత్రమిదని నవదీప్‌ విజయంపై ఎంతో ధీమాగా ఉన్నారు. అందుకే ఈ సినిమాకు నవదీప్‌ 2.0గా తనని...

ప్రతి ఒక్కరు రిలేట్‌ అవుతారు

నవదీప్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్‌ మౌళి’. తనను ఇప్పటివరకు చూడని విధంగా ఆవిష్కరించే చిత్రమిదని నవదీప్‌ విజయంపై ఎంతో ధీమాగా ఉన్నారు. అందుకే ఈ సినిమాకు నవదీప్‌ 2.0గా తనని ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటున్నారు. పంఖురి గిద్వాని, భావన సాగి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సి స్పేస్‌, నైరా క్రియేషన్స్‌, శ్రీకర స్టూడియోస్‌ నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ ‘‘సినీ ఇండస్ట్రీలో అజాతశత్రువు ఎవరైనా ఉన్నారంటే అది నవదీప్‌ మాత్రమే. ఈ సినిమాలోని విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. హీరో క్యారెక్టరైజేషన్‌ను చాలా బాగా తీర్చిదిద్దారు’’ అని చెప్పారు. హీరో నవదీప్‌ మాట్లాడుతూ ‘‘ఇది చాలా కొత్త కథ. సంవత్సరం పాటు ఈ సినిమాలోని నా లుక్‌ కోసమే కష్టపడ్డాను’’ అని చెప్పారు. డైరెక్టర్‌ అవనీంద్ర మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నవదీప్‌ క్యారెక్టర్‌లో చాలా విభిన్నమైన షేడ్స్‌ ఉంటాయి. ఇది ఒక చిత్రకారుడి ఎమోషనల్‌ జర్నీ. ప్రతి ఒక్కరు ఈ సినిమాకు రిలేట్‌ అవుతారు’’ అని చెప్పారు.

Updated Date - Apr 10 , 2024 | 01:46 AM