ప్రతి పాత్రకూ ప్రాముఖ్యం
ABN , Publish Date - Oct 22 , 2024 | 02:21 AM
వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మట్కా’. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మాతలు. మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో...
వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మట్కా’. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మాతలు. మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమా నవంబరు 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మూవీ టీజర్, సలోని క్యారెక్టర్‌ను పద్మగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమాలో ప్రతి పాత్రకూ చాలా ప్రాముఖ్యం ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.