ప్రతి భారతీయుడూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతాడు

ABN , Publish Date - Feb 28 , 2024 | 04:03 AM

వరుణ్‌తేజ్‌ నటించిన ఎయిర్‌ఫోర్స్‌ యాక్షన్‌ మూవీ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మార్చి ఒకటిన విడుదల కానుంది. శక్తి ప్రతాప్‌సింగ్‌ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించింది...

ప్రతి భారతీయుడూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతాడు

వరుణ్‌తేజ్‌ నటించిన ఎయిర్‌ఫోర్స్‌ యాక్షన్‌ మూవీ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మార్చి ఒకటిన విడుదల కానుంది. శక్తి ప్రతాప్‌సింగ్‌ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించింది. విడుదల సందర్బంగా మంగళవారం వరుణ్‌తేజ్‌ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలు వెల్లడించారు.

  • దర్శకుడు శక్తి ప్రతాప్‌సింగ్‌ 2020లో ఈ కథతో నన్ను సంప్రదించారు. కథ నాకు బాగా నచ్చింది. సోనీ పిక్చర్స్‌ సంస్థకే నేను ఓ సినిమా చేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది టేకాఫ్‌ కాలేదు. నేషనల్‌ అప్పీల్‌ ఉన్న కంటెంట్‌ కావడంతో ఇది వారికి కూడా నచ్చింది. చాలా గ్రాండ్‌ బడ్జెట్‌తో పక్కాగా ప్లాన్‌ చేసి సినిమా తీశారు. దర్శకుడు ఉత్తరాదివాడే ఆయినా తెలుగులో చేయాలనే కోరిక ఉంది. అందుకే తెలుగు, హిందీ వెర్షన్స్‌లో తీశాం. ఒక భాషలో తీసిన వెంటనే మరో భాషలో చిత్రీకరించారు.

  • దర్శకుడు శక్తి ప్రతాప్‌సింగ్‌ ఈ ప్రాజెక్ట్‌ కోసం చాలా రీసెర్చ్‌ చేశారు. సినిమా అంటే అతనికి ఫ్యాషన్‌. అయినా ఏదో ఒక సినిమా చేయాలని అనుకోకుండా నా ద్వారా ఈ చిత్రకథను చెప్పాలని అనుకున్నాడు. ఇంతకుముందు అతను చేసిన షార్ట్‌ ఫిల్మ్‌ బాగా వైరల్‌ అయింది. ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు కూడా అది చూసి ఆశ్చర్యపోయారు. దాన్నే సినిమా చేయాలనుకుంటే కావాల్సిన సహకారాన్ని అందిస్తామని వారు చెప్పారు. దర్శకుడికి వీఎఫ్‌ఎక్స్‌ పై మంచి పట్టు ఉండడంతో విజువల్‌గా కూడా చాలా బాగా వచ్చిందీ చిత్రం

  • పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్ర దాడిలో 40 మంది సీఆర్ఫీఎఫ్‌ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఆపరేషన్‌ నిర్వహించింది. వాలెంటైన్‌ డే నాడు జరిగింది కనుక అలా టైటిల్‌ పెట్టాం. ప్రతి భారతీయుడు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది.

  • ‘అంతరిక్షం’ చిత్ర నిర్మాణ సమయంలో తొలిసారిగా విజువల్‌ ఎఫెక్ట్స్‌తో వర్క్‌ చేయడం మొదట్లో ఇబ్బందిగా అనిపించినా తర్వాత అలవాటైంది. ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ షూటింగ్‌ కోసం ఫైటర్‌ జెట్‌ ఎలా పని చేస్తుంది, ఎంత స్పీడ్‌లో వెళుతుంది అనే వివరాలు ఓ పైలైట్‌ ద్వారా తెలుసుకున్నా. ఒక ఫైట్‌ సిమ్యులేటర్‌లో కూర్చోబెట్టి రియల్‌ లైఫ్‌ ప్రొజెక్షన్‌ అనుభూతి ఇచ్చేలా చేశారు. అందులో కూర్చుంటే నిజంగా ఫ్లైట్‌ నడిపినట్లే అనిపిస్తుంది. ఇలాంటి పాత్రలు చేయడం ఓ ఛాలెంజ్‌. ఇందులో నేను రుద్ర పాత్రలో కనిపిస్తాను. కొందరు రియల్‌ ఎయిర్‌ ఫైటర్స్‌ స్ఫూర్తితో నా పాత్రని అద్భుతంగా డిజైన్‌ చేశారు దర్శకుడు.

  • తొలిసారిగా హిందీలో నటిస్తున్నాను కనుక హిందీ నేర్చుకోవడం కోసం రెండు నెలలు క్లాసులు తీసుకున్నాను. నా భార్య లావణ్య కూడా ఈ విషయంలో హెల్ప్‌ చేసింది. ఒక సీన్‌ మొదట హిందీలో షూట్‌ చేసి, తర్వాత తెలుగులో తీసేవాళ్లు. అప్పుడు మధ్య మధ్యలో హిందీ డైలాగులు కూడా వచ్చేసేవి.

  • ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ అయ్యాక బాబాయ్‌ను కలిశాను. ఆయన సినిమాల గురించి పెద్దగా మాట్లాడరు. కానీ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ టీజర్‌ని ఐదారు సార్లు చూసి ‘చాలా బాగుంది. ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌గా చక్కగా ఉన్నావు. ఈ సినిమా చూడాలని ఉంది’ అని ఆయన అనడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇటువంటి సినిమాలు అంటే బాబాయ్‌కి చాలా ఇష్టం.

Updated Date - Feb 28 , 2024 | 04:03 AM