నీ శవం కూడా దొరక్కుండా చేస్తామన్నారు

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:09 AM

హీరో రాజ్‌తరుణ్‌, అతని ప్రేయసినని చెబుతున్న లావణ్య మఽధ్య మొదలైన వివాదం కాస్త రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా, ఆమె కుటుంబ సభ్యులపైన లావణ ్య శనివారం సంచలన...

  • హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రాపై రాజ్‌తరుణ్‌ మాజీ ప్రేయసిగా చెబుతున్న లావణ్య ఆరోపణలు

  • ఆమెపై పరువు నష్టం దావా వేస్తాను

మాల్వీ మల్హోత్రా

హీరో రాజ్‌తరుణ్‌, అతని ప్రేయసినని చెబుతున్న లావణ్య మఽధ్య మొదలైన వివాదం కాస్త రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా, ఆమె కుటుంబ సభ్యులపైన లావణ ్య శనివారం సంచలన ఆరోపణలు చేశారు.

‘నీకు డబ్బు ఇస్తాం. తీసుకొని రాజ్‌తరుణ్‌ను వదిలేసి వెళ్లిపో. లేదంటే నిన్ను చంపుతాం. హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం మా నాన్నకు స్నేహితుడు. నిన్ను చంపేసి ఇక్కడ లోయలో పడేస్తే నీ శవం కూడా దొరకదు ఏమనుకుంటున్నావో’ అని మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు నన్ను బెదిరించారు. వీటన్నింటికీ నా దగ్గర ఆధారాలున్నాయి. దాంతో నేను కేసు పెట్టాను. వాళ్ల నుంచి నాకు ప్రాణహాని ఉంది. వారి బారి నుంచి నాకు పోలీసులు రక్షణ కల్పించాలి’ అని లావణ్య డిమాండ్‌ చేశారు. ‘‘రాజ్‌తరుణ్‌ నీతో హ్యాపీగా లేడు, నాతోనే హ్యాపీగా ఉంటున్నాడు. అతన్నివదిలే యి’ అని మాల్వీ అడిగింది. కానీ నేను ఒప్పుకోకపోవడంతో ‘రాజ్‌ నుంచి నిన్ను విడ దీస్తాను, జైలుకు పంపుతాను’ అని మాల్వీ సవాల్‌ చేసింది. తను అన్నట్లే నన్ను డ్రగ్స్‌ కేసులో ఇరికించి, 45 రోజులు జైల్లో మగ్గేలా చేసింద’’ని లావణ్య వాపోయారు. ఈ వ్యవహారమంతా రాజ్‌తరుణ్‌ స్నేహితులు వరుణ్‌సందేశ్‌, నిఖిల్‌... ఆయన మేనేజర్‌ రాజా రవీంద్రకు తెలుసు. కానీ వాళ్లంతా ఏమీ పట్టనట్లు ఉంటున్నారని లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు కోసం రాజ్‌ను బెదిరించాల్సిన అవసరం తనకు లేదన్నారు.


‘గతంలో పలు ఇంటర్వ్యూల్లో రాజ్‌ ‘విజయవాడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పింది నా గురించే, అతను నన్ను గచ్చిబౌలిలోని ఎల్లమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. సినిమాల్లో స్థిరపడ్డాక పెళ్లి విషయం బయటకు చెబుదామన్నాడు. ఇప్పుడు మాల్వీ మల్హోత్రా తన జీవితంలోకి ప్రవేశించడంతో నన్ను దూరం పెట్టాడు. వాళ్లిద్దరూ చెన్నైలో కలసి ఉన్నట్లు.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ‘బిగ్‌బాస్‌ ఫేం అరియానా గ్లోరీకి రాజ్‌తరుణ్‌ దగ్గరవుతున్నాడు, వచ్చి నీ సంసారాన్ని కాపాడుకో’ అని రాజారవీంద్ర హెచ్చరించారు. రాజ్‌తరుణ్‌ లేకుండా నేను బ్రతకలేను. ఆయన ఆరోపించినట్లు నాకూ మస్తాన్‌కు మధ్య ఎలాంటి సంబంధం లేదు. అతను నా స్నేహితుడు మాత్రమే’ అని లావ ణ్య చెప్పారు.

లావణ్యే బెదిరించింది

‘మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు లావణ్యను బెదిరించలేదు. ఆమే మాల్వీని బెదిరించింది. ఆ ఆధారాలు అన్నీ మాల్వీ దగ్గర ఉన్నాయి. వాళ్లు కూడా కేసు పెడతారు’ అని లావణ్య చేసిన ఆరోపణలపై రాజ్‌తరుణ్‌ వివరణ ఇచ్చారు.


లావణ్య ఎవరు?

లావణ్య చేస్తున్న కామెంట్స్‌పై నటి మాల్వీ మల్హోత్రా స్పందించారు. ‘నాపై ఆరోపణలు చేస్తున్న లావణ్య ఎవరో కూడా నాకు తెలియదు. ఆమె నా కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబర్స్‌ తీసుకున్నారు. అవి ఎలా రాబట్టుకున్నారో తెలియట్లేదు. దీనిపై సైబర్‌క్రైమ్‌ కేసు పెడతాను. నేను, రాజ్‌తరుణ్‌ కేవలం సినిమాల గురించే మాట్లాడుకుంటాం. మా మధ్య అంతకుమించిన రిలేషన్‌ లేదు. రాజ్‌తరుణ్‌తో నేను గతేడాది సెప్టెంబరులోనే మాట్లాడాను. ఆ తర్వాత మా మధ్య మాటలు కూడా లేవు. నాకు సంబంధం లేని విషయంలోకి ఆమె నన్ను నెడుతోంది. నేను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్నా. రాజ్‌తరుణ్‌తో నటించిన ‘తిరగబడరా సామి’ నా మొదటి సినిమా. సినిమా కెరీర్‌ దెబ్బతింటుందని ఇన్నాళ్లూ కేసు పెట్టకుండా ఆగాను. ఇలాంటి ఆరోపణలు నటిగా నా పరువును దెబ్బతీస్తాయి. ఆమెపై నేను పరువు నష్టం దావా వేస్తాను’’ అని హెచ్చరించారు. రాజ్‌ తరుణ్‌ ఈ వివాదంలోకి నా పేరు ఎందుకు తెచ్చాడో అర్థం కావడం లేదు, లావణ ్యతో నాది స్నేహం మాత్రమే అని మస్తాన్‌ చెప్పాడు.

Updated Date - Jul 08 , 2024 | 06:09 AM