అప్పుడు అక్కడే ఉన్నా

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:25 AM

జపాన్‌ వరుస భూకంప ఘటనలపై ఎన్టీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కొత్త ఏడాదిని కుటుంబంతో కలసి సెలబ్రేట్‌ చేసుకునేందుకు గత వారం ఆయన జపాన్‌ వెళ్లారు...

అప్పుడు అక్కడే ఉన్నా

జపాన్‌ వరుస భూకంప ఘటనలపై ఎన్టీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కొత్త ఏడాదిని కుటుంబంతో కలసి సెలబ్రేట్‌ చేసుకునేందుకు గత వారం ఆయన జపాన్‌ వెళ్లారు. భూకంప హెచ్చరికల నేపథ ్యంలో సోమవారం రాత్రి ఆయన సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ‘నేను క్షేమంగా ఇండియాకు చేరుకున్నాను. గతవారం అంతా నేను అక్కడే గడిపాను. వరుస భూకంప ఘటనలు జపాన్‌ను కుదిపేయడం బాధాకరం. అక్కడి ప్రజలు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. హిందీలో ‘వార్‌ 2’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 01:25 AM