చైనా గోడైనా దూకొచ్చు

ABN , Publish Date - Jan 04 , 2024 | 05:54 AM

నాగార్జున అక్కినేని కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘నా సామిరంగా’. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌తరుణ్‌ కీలకపాత్రపోషిస్తున్నారు..

చైనా గోడైనా దూకొచ్చు

నాగార్జున అక్కినేని కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘నా సామిరంగా’. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌తరుణ్‌ కీలకపాత్రపోషిస్తున్నారు. బుధవారం చిత్రబృందం రాజ్‌తరుణ్‌ పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్‌ వదిలింది. ఈ చిత్రంలో ఆయన భాస్కర్‌ అనే కాలే జ్‌ స్టూడెంట్‌ పాత్రలో కనిపించనున్నారు. రుక్సార్‌ థిల్లాన్‌తో రాజ్‌తరుణ్‌ ప్రేమకథను గ్లింప్స్‌లో ఆవిష్కరించారు. ‘తన చిరునవ్వు కోసం చైనా గోడైనా దూకొచ్చు’ అంటూ ఆయన పలికిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. జనవరి 14న విడుదలవుతున్న ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా ఆశికా రంగనాథ్‌ నటిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అల్లరి నరేశ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి. ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందించారు. సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి.

Updated Date - Jan 04 , 2024 | 05:54 AM