ఆగస్టులో ఇస్మార్ట్‌

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:14 AM

రామ్‌ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఇది ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా కావ్య థాపర్‌ నటిస్తున్నారు...

ఆగస్టులో ఇస్మార్ట్‌

రామ్‌ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఇది ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా కావ్య థాపర్‌ నటిస్తున్నారు. సంజయ్‌దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూరి కనెక్ట్‌ బ్యానర్‌పై పూరి జగన్నాధ్‌, చార్మి కౌర్‌ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: సామ్‌ కె నాయుడు, జియాని జియాన్నెలి, సంగీతం: మణిశర్మ.

Updated Date - Jun 16 , 2024 | 05:14 AM