వినోదం.. విజ్ఞానం.. వెరసి ‘హ్యాపీ ఎండింగ్‌’

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:36 AM

‘మిగతా పరిశ్రమల్లా సినిమాని ఒక పరిశ్రమగా బయట ఇన్వెస్టర్లు ఎవరూ గుర్తించడంలేదు. ఇక్కడ ఏటా 600 సినిమాలు రిజిస్టర్‌ అయితే, ప్రపంచానికి తెలిసేది 150 సినిమాలే. తక్కిన 450 సినిమాలు ఏమయ్యాయి? అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది...

వినోదం.. విజ్ఞానం.. వెరసి ‘హ్యాపీ ఎండింగ్‌’

‘మిగతా పరిశ్రమల్లా సినిమాని ఒక పరిశ్రమగా బయట ఇన్వెస్టర్లు ఎవరూ గుర్తించడంలేదు. ఇక్కడ ఏటా 600 సినిమాలు రిజిస్టర్‌ అయితే, ప్రపంచానికి తెలిసేది 150 సినిమాలే. తక్కిన 450 సినిమాలు ఏమయ్యాయి? అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. మేకింగ్‌పై అవగాహన లేకుండా థర్డ్‌ పర్సన్‌ను నమ్మి సినిమాలను నిర్మిస్తున్నారు. ఒక కొత్త హీరోతో కోటి రూపాయలతో తీయాల్సిన సినిమాకు మూడు కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఈ అవగాహనలేమి వల్ల కాస్ట్‌ ఫెయిల్యూర్‌ సినిమాలు ఎక్కువైపోయాయి. ఏటా 400 నుంచి 500కోట్ల వరకూ కొత్త నిర్మాతలు ఈ పరిశ్రమలో నష్టపోతున్నారు. అందుకే సినిమా తీయాలనుకునే కొత్త నిర్మాతలకు ప్రొడక్షన్‌ నుంచి రిలీజ్‌ వరకూ ఒక బ్రిడ్జ్‌లా ఉండేలా మా సంస్థ పనిచేస్తుంది.’ అన్నారు నిర్మాత అనిల్‌ పల్లాల. యోగేశ్‌ కుమార్‌, సంజయ్‌రెడ్డిలతో కలసి ఆయన నిర్మించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’. యష్‌ పూరి, అపూర్వరావ్‌ జంటగా నటించారు. కౌశిక్‌ భీమిడి దర్శకుడు. ఫిబ్రవరి 2న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మేకింగ్‌, డిస్ట్రిబ్యూటింగ్‌, బిజినెస్‌.. అంశాలపై పూర్తి అవగాహనతో ఈ రంగంలోకి వచ్చాం. మా వింతగాధ వినుమ, జార్జిరెడ్డి చిత్రాల తర్వాత మేం నిర్మించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’. అనుకున్న బడ్జెట్‌లో సినిమాను పూర్తిచేశాం. కొత్త హీరో కాబట్టి ప్రీరిలీజ్‌ బిజినెస్‌ గురించి ఆశించలేదు. విడుదల తర్వాత స్పందనను బట్టి బిజినెస్‌ చేయాలనుకున్నాం’ అని తెలిపారు అనిల్‌ పల్లాల. కథను నమ్మి ఈ సినిమా చేశామని, వర్త్‌ ఉన్న సినిమా చేశామని అనుకుంటున్నామని, వికీ డోనర్‌, ఓమైగాడ్‌ 2 చిత్రంలో ఉన్నటువంటి లేయర్లు, ఎలిమెంట్స్‌ ‘హ్యాపీ ఎండింగ్‌’లోనూ ఉన్నా ఇబ్బంది లేకుండా ఉంటాయని, వినోదంతోపాటు విజ్ఞానం కూడా అందించే సినిమా ఇదని నిర్మాత పేర్కొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 05:36 AM