వినోదం గ్యారంటీ
ABN , Publish Date - Nov 04 , 2024 | 05:32 AM
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా సాయికిషోర్ మచ్చా దర్శకత్వంలో నటించిన చిత్రం ‘ధూం ధాం’. ఎం.ఎ్‌స.రామ్‌కుమార్ నిర్మాత. ఈనెల 8న థియేటర్లలో విడుదలవుతోంది...
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా సాయికిషోర్ మచ్చా దర్శకత్వంలో నటించిన చిత్రం ‘ధూం ధాం’. ఎం.ఎ్‌స.రామ్‌కుమార్ నిర్మాత. ఈనెల 8న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సాయి కిషోర్ మాట్లాడుతూ ‘రచయిత గోపీ మోహన్ ‘ధూం ధాం’ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. కథ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అలా ఈ సినిమా మొదలైంది. మొత్తం షూటింగ్ అమెరికాలో చేయాలని అనుకున్నాం. అనుమతుల కోసం ఆరు నెలలు ప్రయత్నించినా కుదరలేదు. ఆ తర్వాత యూర్‌పలోని పోలెండ్‌ను సెలెక్ట్ చేసుకున్నాం. నిర్మాత రామ్‌కుమార్, ఆయన మంచితనం గురించి, సినిమా మీద ఆయనకున్న ప్యాషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధం చుట్టూ కథ సాగుతుంది. దాంతోపాటు మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది.
సినిమా సరదాగా మొదలై ఇంటర్వెల్ దాకా మంచి సాంగ్స్, లవ్ ట్రాక్‌తో ప్లెజెంట్‌గా వెళ్తుంది. చేతన్ మంచి టాలెంటెడ్ హీరో. అతనిలో మంచి టైమింగ్ ఉంది. హెబ్బా పటేల్ కూడా తన క్యారెక్టర్‌లో ఆకట్టుకునేలా నటించారు. ఈ మధ్య మనం థ్రిల్లర్, పీడియారిక్, స్కామ్ మూవీస్ చూస్తున్నాం. వాటిలో కామెడీ మిస్ అయ్యాం. ఆ మిస్ అయిన ఎంటర్‌టైన్‌మెంట్ ‘ధూం ధాం’లో చూస్తారు’ అని తెలిపారు.