వినోదాత్మకంగా డార్లింగ్‌

ABN , Publish Date - Jul 12 , 2024 | 01:35 AM

అశ్విన్‌రామ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘డార్లింగ్‌’. ప్రియదర్శి, నభానటేశ్‌ జంటగా నటించగా, కె.నిరంజన్‌రెడ్డి, చైతన్య నిర్మించారు. ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అశ్విన్‌రామ్‌...

అశ్విన్‌రామ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘డార్లింగ్‌’. ప్రియదర్శి, నభానటేశ్‌ జంటగా నటించగా, కె.నిరంజన్‌రెడ్డి, చైతన్య నిర్మించారు. ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అశ్విన్‌రామ్‌ మీడియాతో ముచ్చటించారు. ‘‘కొత్త జంట పెళ్లిని ఎలా హ్యాండిల్‌ చేస్తారనేది ఇందులో వినోదాత్మకంగా చూపించా. సినిమాల ద్వారా సందేశాలు ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. ఈ సినిమాలో ఎంటర్టైన్‌మెంట్‌తో పాటూ ఓ సామాజిక బాధ్యతను కూడా జత చేశా. ఇందులో కథానాయకుడి పాత్ర చాలా అమాయకంగా.. కథానాయిక పాత్ర చలాకీగా ఉండాలి. అలా ఆ పాత్రలకి సరిపోయే నటీనటులను పరిశీలించాక.. ప్రియదర్శి, నభానటేశ్‌ వందశాతం సరిపోతారని అనిపించి వారిని తీసుకున్నాం. నభా పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయి.. సినిమాలో నభా మీ అందరినీ పూర్తిగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వినోదంతో పాటు భావోద్వేగాలని సమపాళ్లలో మిక్స్‌ చేసి తీసిన ఈ సినిమాలో.. హీరో హీరోయిన్ల మధ్యన వచ్చే సన్నివేశాలు అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా మేకింగ్‌ విషయంలో పూర్తి స్వేచ్చనిచ్చారు.

Updated Date - Jul 12 , 2024 | 01:35 AM