ఆద్యంతం వినోదాత్మకంగా

ABN , Publish Date - May 06 , 2024 | 02:13 AM

పాపులర్‌ కమెడియన్‌ గెటప్‌ శ్రీను లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘రాజుయాదవ్‌’. కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. కె.ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లేపల్లి సంయుక్తంగా నిర్మించారు...

ఆద్యంతం వినోదాత్మకంగా

పాపులర్‌ కమెడియన్‌ గెటప్‌ శ్రీను లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘రాజుయాదవ్‌’. కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. కె.ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లేపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 17న ‘రాజుయాదవ్‌’ విడుదలవుతోంది. ఆదివారం మూవీ ట్రైలను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా మాట్లాడుతూ ‘‘శ్రీను విలక్షణమైన నటుడు. ఆయన నటించే పాత్ర సవాల్‌గా ఉంటే చెలరేగిపోతారు. ఈ సినిమా కథలో హిలేరియస్‌ ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు హృదయానికి హత్తుకునే భావోద్వేగాలూ ఉన్నాయి’’ అని చెప్పారు. గెటప్‌ శ్రీను మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడ్డారు. వారందరి కష్టం తెరపై కనపడుతుంది. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది’’ అని అన్నారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు’’ అని డైరెక్టర్‌ కృష్ణమాచారి అన్నారు. నిర్మాత ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో గెటప్‌ శ్రీను అద్భుతంగా నటించారు. ఆయన నటన అందరికీ గుర్తుండిపోతుంది’’ అని అన్నారు.

Updated Date - May 06 , 2024 | 02:13 AM