అలరించే హనీ - బన్నీ
ABN , Publish Date - Oct 16 , 2024 | 06:17 AM
వరుణ్‌ధావన్, సమంత జంటగా నటించిన వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో...
వరుణ్‌ధావన్, సమంత జంటగా నటించిన వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. 90వ దశ కం నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్ ఇది, హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ‘అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన వెబ్‌సిరీస్ ఇది. ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌లో అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. హనీ పాత్ర నటిగా నాకు సవాల్ విసిరింది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఇది నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన పాత్ర’ అని చెప్పారు. యాక్షన్ సన్నివేశాల కోసం నా శక్తికి మించి కష్టపడ్డాను అని వరుణ్‌దావన్ అన్నారు. ఒక సరికొత్త ప్రపంచంలో భాగమయ్యే అవకాశం ‘హనీ బన్నీ’తో దక్కిందని రాజ్ అండ్ డీకే తెలిపారు.