తుఫాన్‌ను ఎంజాయ్‌ చేస్తారు

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:04 AM

విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్‌’. మేఘా ఆకాశ్‌ కథానాయిక. విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో కమల్‌బోరా, డి.లలితా, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా నిర్మిస్తున్నారు...

విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్‌’. మేఘా ఆకాశ్‌ కథానాయిక. విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో కమల్‌బోరా, డి.లలితా, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా నిర్మిస్తున్నారు. ఈ నెల 26న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు.విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నేపథ్యం చాలా కొత్తగా ఉంటుంది. సినిమాను అందరూ ఎంజాయ్‌ చేస్తారు’’ అని అన్నారు. విజయ్‌ మిల్టన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: ప్రవీణ్‌ కేఎల్‌, సంగీతం: అచ్చు రాజమణి, విజయ్‌ ఆంటోని.

Updated Date - Jul 08 , 2024 | 06:04 AM