భీమ పాత్రను ఎంజాయ్‌ చేస్తారు

ABN , Publish Date - Mar 07 , 2024 | 01:40 AM

గోపీచంద్‌ హీరోగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమ’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఈ చిత్రానికి కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వం వహించారు. విడుదల సందర్భంగా...

భీమ పాత్రను ఎంజాయ్‌ చేస్తారు

గోపీచంద్‌ హీరోగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమ’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఈ చిత్రానికి కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వం వహించారు. విడుదల సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ ‘నేను బెంగళూరులో పుట్టి పెరిగాను. ఇప్పటివరకూ కన్నడ చిత్రాలే చేశాను. తెలుగులో రాధామోహన్‌ గారి ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రంలో రెండు పాటలకు కొరియోగ్రఫీ చేశాను. ఆయనే నన్ను తెలుగులో దర్శకుడిగా పరిచయం చేస్తుండడం ఆనందంగా ఉంది. గోపీచంద్‌గారికి మొదట ఒక కథ చెప్పాను. ఆయన కొన్ని మార్పులు చెప్పారు. ఎనిమిది నెలలు గ్యాప్‌ తీసుకుని ‘భీమ’ కథ చెప్పాను. అది ఆయనకు నచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎలివేషన్‌, ఎమోషన్‌ కలిగిన మంచి కమర్షియల్‌ సినిమా ఇది. సోషల్‌ మెసేజ్‌ కూడా ఉంది. సెమీ ఫాంటసీ ఎలిమెంట్‌ కూడా ఉంది. ముఖ్యంగా భీమ పాత్ర చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది’ అని చెప్పారు. గోపీచంద్‌ వండర్‌ఫుల్‌ ఆర్టిస్ట్‌ అని చెబుతూ ‘ఆయన సినిమాలన్నీ చూశాను. తనకి యూనిక్‌ బాడీ లాంగ్వేజి ఉంది. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. చాలా పాజిటివ్‌. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. భీమ పాత్ర ఆయనకే సూట్‌ అవుతుందని ఆయనకే చెప్పాను’ అన్నారు హర్ష. నిర్మాత రాధామోహన్‌ చాలా ప్యాషన్‌ ఉన్న వ్యక్తి అనీ ఈ సినిమాకు కావాల్సిన వన్నీ సమకూర్చడంతో మంచి క్వాలిటీతో సినిమా తీయగలిగినట్లు ఆయన తెలిపారు.

Updated Date - Mar 07 , 2024 | 01:40 AM