కామెడీని ఎంజాయ్‌ చేస్తారు

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:35 AM

చంద్రశేఖర్‌, సోనాలి జంటగా కే సంతోష్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘‘ప్లాంట్‌ మాన్‌’. పన్నారాయల్‌ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ని నిర్వహించారు...

కామెడీని ఎంజాయ్‌ చేస్తారు

చంద్రశేఖర్‌, సోనాలి జంటగా కే సంతోష్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘‘ప్లాంట్‌ మాన్‌’. పన్నారాయల్‌ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం సక్సె్‌సమీట్‌ను నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘చిన్న సినిమాకు పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రంలో కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. రోజురోజుకూ వసూళ్లు పెరుగుతున్నాయి’ అన్నారు. పన్నారాయల్‌ మాట్లాడుతూ ‘నేను నిర్మాతగా చేసిన తొలి చిత్రమే హిట్‌ టాక్‌ తెచ్చుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇంత సక్సె్‌సను నేను ఊహించలేదు. ఈ ఉత్సాహంతో ఏటా రెండు సినిమాలు చేస్తాను’ అని చెప్పారు. మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని సోనాలి తెలిపారు.

Updated Date - Jan 08 , 2024 | 01:35 AM