ఈ జర్నీని ఎంజాయ్‌ చేశా

ABN , Publish Date - Apr 10 , 2024 | 01:48 AM

అంజలి నటించిన హారర్‌ కామెడీ చిత్రం ‘గీతాంజలి’ 2014లో విడుదలై సెన్షేషనల్‌ హిట్‌గా నిలిచింది. హారర్‌ కామెడీ మూవీస్‌లో కొత్త ఒరవడిని సృష్టించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తోన్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’...

ఈ జర్నీని ఎంజాయ్‌ చేశా

అంజలి నటించిన హారర్‌ కామెడీ చిత్రం ‘గీతాంజలి’ 2014లో విడుదలై సెన్షేషనల్‌ హిట్‌గా నిలిచింది. హారర్‌ కామెడీ మూవీస్‌లో కొత్త ఒరవడిని సృష్టించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తోన్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ లోనూ అంజలి నటించింది. ఈ సినిమా ఆమెకు 50వ చిత్రం కావడం విశేషం. ఈ నెల 11న హారర్‌ కామెడీగా తెరకెక్కిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా అంజలి మీడియాతో ముచ్చటించారు.

నా సినిమాలన్నీ దాదాపు జీ అక్షరంతో మొదలవడం యాధృచ్చికం. గీతాంజలి సినిమాకు సీక్వెల్‌ను తీసుకురావాలనే ఆలోచన ఇప్పటిది కాదు. ఈ సినిమా కథను కోన వెంకట్‌ నాలుగేళ్ల క్రితమే చెప్పారు. కొన్ని అడ్డంకుల వల్ల ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కడం ఆలస్యమైంది. అన్ని అడ్డంకులను దాటుకొని అద్భుతమైన అవుట్‌పుట్‌తో ఈ సినిమాను పూర్తిచేసినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా సీక్వెల్‌ కాబట్టి పాత క్యారెక్టర్స్‌ను మార్చలేం. కాబట్టి కొత్త క్యారెక్టర్స్‌ను స్టోరీలోకి తీసుకువచ్చాం. ఈ సినిమాలో హారర్‌, కామెడీతో పాటు మిగిలిన అన్ని ఎమోషన్స్‌ ఉన్నాయి. ఈ చిత్రం నా 50వ చిత్రం కావడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అప్పుడే ఇన్ని సినిమాలు చేసేశానా అనిపిస్తుంది. ఒక నటిగా ఈ జర్నీని ఎంజాయ్‌ చేస్తున్నాను’’ అని చెప్పారు.

Updated Date - Apr 10 , 2024 | 01:48 AM