టిల్లు స్క్వేర్‌ చూసి ఎంజాయ్‌ చేశా

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:57 AM

ఇటీవల విడుదలై విజయం సాధించిన ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాన్ని చూసి మెగాస్టార్‌ చిరంజీవి బాగా ఎంజాయ్‌ చేశారు. వెంటనే ఆయన చిత్రబృందాన్ని తన ఇంటికి పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించడం విశేషం...

టిల్లు స్క్వేర్‌ చూసి ఎంజాయ్‌ చేశా

ఇటీవల విడుదలై విజయం సాధించిన ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాన్ని చూసి మెగాస్టార్‌ చిరంజీవి బాగా ఎంజాయ్‌ చేశారు. వెంటనే ఆయన చిత్రబృందాన్ని తన ఇంటికి పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించడం విశేషం. ఆయన ఆహ్వానంపై హీరో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు మల్లిక్‌ రామ్‌, నిర్మాత నాగవంశీ చిరు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ఒక సినిమా హిట్‌ అయి, దానికి సీక్వెల్‌గా మరో చిత్రం వస్తుంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. వాటిని అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ హీరో సిద్ధు, దర్శకుడు మల్లిక్‌రామ్‌, నిర్మాత నాగవంశీ.. ఇతర టీమ్‌ అంతా కలసి ప్రేక్షకులు మెచ్చేలా ‘డీజె టిల్లు’కు సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్‌’ను అందించడంలో విజయం సాధించారు. అదే ఉత్కంఠ, అదే సరదా, అదే నవ్వుల జల్లు. నటుడిగా, కథకుడిగా వ్యవహరించి, ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ప్రధాన కారణమైన సిద్ధును అభినందిస్తున్నాను.ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డామో, నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపామో అని సిద్దు నాతో చెప్పాడు. దర్శకుడు మల్లిక్‌ రామ్‌, ఎడిటర్‌ నవీన్‌ నూలి సహా అందరి సమష్టి కృషి ఉందని తెలిపాడు. విజయం సాధించిన దర్శకనిర్మాతలకు నా శుభాకాంక్షలు. ‘మ్యాడ్‌’ చిత్రంతో దర్శకుడిగా ఆకట్టుకొన్న కల్యాణ్‌ ఈ సినిమా రచనలో సహకారం అందించాడని విన్నాను. కేవలం యువతనే కాకుండా అన్ని వర్దాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా తీశారు. ఈ సినిమా చూసి నేను బాగా ఎంజాయ్‌ చేశా. మీరు చేయండి’ అన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 05:57 AM