ఫ్యామిలీతో చూసి ఎంజాయ్‌ చేస్తారు

ABN , Publish Date - Apr 10 , 2024 | 01:42 AM

సరికొత్త కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్‌ ఆంటోనీ తాజా చిత్రం ‘లవ్‌ గురు’ ఈ గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం...

ఫ్యామిలీతో చూసి ఎంజాయ్‌ చేస్తారు

సరికొత్త కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్‌ ఆంటోనీ తాజా చిత్రం ‘లవ్‌ గురు’ ఈ గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నేను ఎక్కువగా వర్తమానంలోనే ఉంటాను. భవిష్యత్‌ గురించి ఆలోచించను. మనకు ఏది కావాలో, ఏది ఇవ్వాలో విధి నిర్ణయించే ఉంటుంది. ఈ సినిమా విషయానికి వస్తే కథ బాగా నచ్చింది. సినిమా తీస్తే హిట్‌ అవుతుందనే నమ్మకం కలిగింది. కామెడీ బాగా కుదిరింది. ఫ్యామిలీతో చూసి మీరంతా ఎంజాయ్‌ చేస్తారు. ‘లవ్‌ గురు’ సినిమా చూసిన తర్వాత మీ భార్యను ప్రేమించడం నేర్చుకుంటారు. ఇందులో ఒక ఎమోషనల్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఉంది. దాన్ని ఇప్పుడు రివీల్‌ చేయను. దర్శకుడు వినాయక్‌ తన జీవితంలో చూసిన అనుభవాలతో ఈ చిత్రకథ రెడీ చేశాడు’ అని చెప్పారు.

‘బిచ్చగాడు 3’ చిత్రాన్ని తీస్తున్నట్లు విజయ్‌ ఆంటోనీ చెబుతూ ‘నా కెరీర్‌లోనే అది బిగ్‌ బడ్జెట్‌ ఫిల్మ్‌ అవుతుంది. దానికి నేనే దర్శకత్వం వహిస్తా. ప్రస్తుతం మా ప్రొడక్షన్‌లో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి అక్టోబర్‌లో, మరొకటి సంక్రాంతికి, ఇంకొకటి వచ్చే వేసవికి విడుదలవుతాయి’ అన్నారు.

Updated Date - Apr 10 , 2024 | 01:42 AM