పెళ్లి కాదు నిశ్చితార్థం?
ABN , Publish Date - Mar 29 , 2024 | 03:38 AM
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితీరావ్ హైదరీ తమ పెళ్లి విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. బుధవారం వనపర్తిలోని గుడిలో వీరిద్దరి పెళ్లి జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అక్కడ జరిగింది పెళ్లి కాదు నిశ్చితార్థం మాత్రమే అని అదితీ, సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా...

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితీరావ్ హైదరీ తమ పెళ్లి విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. బుధవారం వనపర్తిలోని గుడిలో వీరిద్దరి పెళ్లి జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అక్కడ జరిగింది పెళ్లి కాదు నిశ్చితార్థం మాత్రమే అని అదితీ, సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తమ నిశ్చితార్థపు ఉంగరాలను చూపుతూ ఇద్దరూ కలసి దిగిన ఫొటోను వారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఆమె ఓకే చెప్పడంతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాం’ అని సిద్ధార్థ్ చెప్పారు. అయితే ‘వీరిద్దరూ చెప్పినది నిజమేనా?’ అనే సందేహాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. దీనికో కారణం ఉంది. అదితీరావ్ నటించిన ‘హీరామండి: ద డైమండ్ బజార్’ వెబ్‌సిరీస్ రిలీజ్‌డేట్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. అదితి తప్ప నటీనటులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాంకర్ సచిన్ కుంబర్ మాట్లాడుతూ ‘ఈ రోజు అదితీరావ్ పెళ్లి చేసుకోబోతున్నారు. అందుకే ఆమె ఈ కార్యక్రమానికి రాలేదు’ అని చెప్పడం గమనార్హం. దీంతో పెళ్లి విషయంలో ఈ జంట ఇంత డొంకతిరుగుడుగా వ్యవహరించడం ఎందుకో అర్థం కావడంలేదంటున్నారు నెటిజన్లు.