ఎమోషన్స్‌, యాక్షన్‌ మెప్పించాయి

ABN , Publish Date - Apr 21 , 2024 | 05:01 AM

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘భజే వాయువేగం’ చిత్రం టీజర్‌ను శనివారం చిరంజీవి ఆవిష్కరించారు. ‘విశ్వంభర’ సెట్‌లో చిత్రబృందం చిరంజీవిని కలిసింది...

ఎమోషన్స్‌, యాక్షన్‌ మెప్పించాయి

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘భజే వాయువేగం’ చిత్రం టీజర్‌ను శనివారం చిరంజీవి ఆవిష్కరించారు. ‘విశ్వంభర’ సెట్‌లో చిత్రబృందం చిరంజీవిని కలిసింది. ‘నా అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ నటించిన ‘భజే వాయువేగం’ చిత్రం టీజర్‌తోపాటు టైటిల్‌ పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ అంశాలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఘన విజయం అందుకోవాలి’ అని ఈ సందర్భంగా చిరంజీవి ఆకాంక్షించారు. డ్రగ్స్‌ కేసులో పోలీసుల ఇన్వెస్టిగేషన్‌, తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగిన టీజర్‌ ఆధ్యంతం అలరించింది. యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో కార్తికేయ విజృభించారు. ఆయనకు జోడీగా ఐశ్వర్య మీనన్‌ నటిస్తున్నారు. రాహుల్‌ టైసన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్‌ నిర్మిస్తోంది. త్వరలో మేకర్స్‌ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్‌, కపిల్‌ కుమార్‌. సినిమాటోగ్రఫీ: ఆర్‌. డి. రాజశేఖర్‌

Updated Date - Apr 21 , 2024 | 05:01 AM