ఎమోషనల్‌ సిద్ధాంతం

ABN , Publish Date - Feb 14 , 2024 | 06:07 AM

ఒకప్పటి బాలనటుడు దీపక్‌ సరోజ్‌ హీరోగా అరంగేట్రం చేస్తున్న ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. యశస్వీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని నువ్వు నమ్మిన ‘సిద్ధాంతం’ అంటూ...

ఎమోషనల్‌ సిద్ధాంతం

ఒకప్పటి బాలనటుడు దీపక్‌ సరోజ్‌ హీరోగా అరంగేట్రం చేస్తున్న ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. యశస్వీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని నువ్వు నమ్మిన ‘సిద్ధాంతం’ అంటూ సాగే పాటను మంగళవారం విడుదల చేశారు. సినిమాలో చాలా కీలకమైన ఈ పాటను సంగీత దర్శకుడు రథన్‌ పవర్‌ఫుల్‌ ఎమోషనల్‌ నంబర్‌గా కంపోజ్‌ చేశారు. బాలాజీ రాసిన ఈ పాట కథలోని లోతుని తెలియజేస్తుంది. సింగర్‌ శరత్‌ సంతోష్‌ మనసుని హత్తుకొనే విధంగా ఈ పాట పాడారు.. ఈ పాటలో దీపక్‌ అభినయం ఆకట్టుకొనే విధంగా ఉంది. యూనిక్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని జయ అడపాక, ప్రదీప్‌ పూడి, సుధాకర్‌ బోయిన నిర్మిస్తున్నారు.

Updated Date - Feb 14 , 2024 | 06:07 AM