సెప్టెంబర్‌లో ఎమర్జెన్సీ

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:56 AM

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. గతేడాదే చిత్రీకరణ పూర్తయింది. పలుమార్లు విడుదల తేదీని...

సెప్టెంబర్‌లో ఎమర్జెన్సీ

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. గతేడాదే చిత్రీకరణ పూర్తయింది. పలుమార్లు విడుదల తేదీని ప్రకటించినా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయారు. తాజాగా చిత్రబృందం కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. సెప్టెంబర్‌ 6న ‘ఎమర్జెన్సీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఇందిరాగాంధీ పాత్రలో కంగన లుక్‌ ఆకట్టుకుంది. ‘మణికర్ణిక’ చిత్రం తర్వాత కంగన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మాజీ ప్రధాని వాజ్‌పాయ్‌ పాత్రలో శ్రేయస్‌ తల్పడే, జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌ కనిపించనున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కంగనా రనౌత్‌ మధ్య ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 26 , 2024 | 05:56 AM