ఎనిమిది వసంతాలు!

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:13 AM

స్టార్స్‌తో బిగ్‌ బడ్జెట్‌ చిత్రాలు తీయడమే కాకుండా కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిన్న చిత్రాలనూ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆ తరహాలో ఈ సంస్థ అందిస్తున్న తాజా చిత్రం ‘ఎనిమిది

ఎనిమిది వసంతాలు!

స్టార్స్‌తో బిగ్‌ బడ్జెట్‌ చిత్రాలు తీయడమే కాకుండా కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిన్న చిత్రాలనూ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆ తరహాలో ఈ సంస్థ అందిస్తున్న తాజా చిత్రం ‘ఎనిమిది వసంతాలు’. 19 ఏళ్ల వయసు నుంచి 27 ఏళ్ల వరకూ ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో ఓ యువతి జీవితంలో పరిచయమయ్యే విభిన్నమైన వ్యక్తులు, ప్రదేశాలు, భావోద్వేగాలను వివరించే చిత్రమిదని దర్శకుడు ఫణీంద్ర చెప్పారు. ‘మను’ సినిమాతో పలు అవార్డులు, విమర్శకుల ప్రశంసలు పొందారాయన. ‘మ్యాడ్‌’ చిత్రంలో నటించిన అనంతిక సనీల్‌కుమార్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. శుద్ధి అయోధ్యగా ఆమెను పరిచయం చేస్తూ టైటిల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ‘ఎనిమిది వసంతాలు’ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాకు సంగీతం: నరేశ్‌ కుమారన్‌, ఛాయాగ్రహణం: విశ్వనాథ్‌రెడ్డి, నిర్మాతలు: నవీన్‌ యర్నేని, రవిశంకర్‌.

Updated Date - Jun 08 , 2024 | 05:13 AM