చిన్నప్పటి నిర్ణయమే సక్సెస్‌ ఇచ్చింది

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:21 AM

విజయానికి అడ్డతోవలు లేవనేది లోకోక్తి. కథానాయిక నేహాశెట్టి కూడా అదే మాట చెబుతున్నారు. ముందస్తు ప్రణాళికతో సిద్ధమవ్వడం వల్లే ఏ రంగంలో అయినా సక్సెస్‌ సొంతం అవుతుందంటున్నారు ఇందుకు తన సొంత అనుభవాన్నే...

చిన్నప్పటి నిర్ణయమే సక్సెస్‌ ఇచ్చింది

విజయానికి అడ్డతోవలు లేవనేది లోకోక్తి. కథానాయిక నేహాశెట్టి కూడా అదే మాట చెబుతున్నారు. ముందస్తు ప్రణాళికతో సిద్ధమవ్వడం వల్లే ఏ రంగంలో అయినా సక్సెస్‌ సొంతం అవుతుందంటున్నారు ఇందుకు తన సొంత అనుభవాన్నే ఉదాహరణగా చూపుతున్నారు. తన స్కూల్‌ రోజుల్లోనే నటనపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నారట. ఇక అప్పటి నుంచి నటనకు సంబంధించిన వివిధ అంశాల గురించి తెలుసుకోవడం, డైలాగ్స్‌ చెప్పడం, డాన్స్‌ ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించారట. టాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాకనే తెలుగు భాష నేర్చుకున్నాను. ఇలా విభిన్న అంశాలమీద అవగాహన సాధించడం సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. మొదట్లో విజయాలు రాకపోయినా మన కష్టానికి తగిన అవకాశాలు వెతుక్కుంటూ రావడంతో హీరోయిన్‌గా నిలదొక్కుకున్నాను అని ఆమె చెప్పారు. ఇటీవలే విడుదలైన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రంలో కథానాయికగా ఆకట్టుకున్నారు నేహ.

Updated Date - Jun 20 , 2024 | 02:21 AM