ముందుగానే దేవర రాక

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:36 AM

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’. గురువారం చిత్రబృందం కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో తొలి భాగం ‘దేవర: పార్ట్‌ 1’ను...

ముందుగానే దేవర రాక

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’. గురువారం చిత్రబృందం కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో తొలి భాగం ‘దేవర: పార్ట్‌ 1’ను అక్టోబర్‌ 10న విడుదల చేస్తున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది. అయితే ఇప్పుడు విడుదల తేదీ ముందుకు మారింది. సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు గురువారం తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఎన్టీఆర్‌ మాస్‌ లుక్‌ లో కనిపించారు. జాన్వీకపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, నరైన్‌ కీలకపాత్రలు పోషించారు. మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ కె. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - Jun 14 , 2024 | 03:36 AM