నానితో మళ్లీ దసరా టీమ్‌

ABN , Publish Date - Apr 01 , 2024 | 01:48 AM

పీరియాడిక్‌ లవ్‌, మాస్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ‘దసరా’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి విదితమే. హీరో నానికి ఎంతో పేరు తెచ్చిన సినిమా ఇది....

నానితో మళ్లీ దసరా టీమ్‌

పీరియాడిక్‌ లవ్‌, మాస్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ‘దసరా’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి విదితమే. హీరో నానికి ఎంతో పేరు తెచ్చిన సినిమా ఇది. ఇప్పుడు ‘దసరా’ టీమ్‌.. నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల, నిర్మాత సుధాకర్‌ చెరుకూరి కొత్త సినిమా కోసం మళ్లీ చేతులు కలిపింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. నానిని మరో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో ప్రజెంట్‌ చేయడానికి దర్శకుడు శ్రీకాంత్‌ స్ర్కిప్ట్‌ సిద్ధం చేశారు. భారీ బడ్జెట్‌తో సుధాకర్‌ చెరుకూరి నిర్మించే ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలవుతుంది.

Updated Date - Apr 01 , 2024 | 01:48 AM