పవన్‌కల్యాణ్‌తో సమావేశమై చర్చిద్దామని దుర్గేశ్‌ రామారావు

ABN , Publish Date - Jun 25 , 2024 | 12:50 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్‌ను సీనియర్‌ నిర్మాత కె.ఎస్‌.రామారావు సోమవారం అమరావతిలో కలసి అభినందించారు...

 పవన్‌కల్యాణ్‌తో సమావేశమై చర్చిద్దామని దుర్గేశ్‌ రామారావు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్‌ను సీనియర్‌ నిర్మాత కె.ఎస్‌.రామారావు సోమవారం అమరావతిలో కలసి అభినందించారు. త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో సమావేశమై సినీ రంగ సమస్యలను చర్చిద్దామని దుర్గేశ్‌ రామారావుకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతుందనీ, అందుకు సహజమైన లొకేషన్లు, ప్రోత్సహించే ప్రభుత్వం ఉన్నాయని రామారావు తెలిపారు. సినిమా పరిశ్రమ పట్ల అవగాహన కలిగిన దుర్గేశ్‌ మంత్రిగా ఉన్నందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 25 , 2024 | 12:50 AM