రూ. రెండు వేల కోట్లు వస్తే.. మాకు కోటే ఇచ్చారు
ABN , Publish Date - Oct 24 , 2024 | 05:34 AM
రెజ్లర్ బబితా పోగాట్ జీవిత కథ ఆధారంగా ఆమిర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం 2016 డిసెంబర్ 23న విడుదలై వసూళ్ల పరంగా దుమ్ము రేపింది. ఆ సినిమా రూ.రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తే తమ కుటుంబానికి కోటి రూపాయలు మాత్రమే ఇచ్చారని..
రెజ్లర్ బబితా పోగాట్ జీవిత కథ ఆధారంగా ఆమిర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం 2016 డిసెంబర్ 23న విడుదలై వసూళ్ల పరంగా దుమ్ము రేపింది. ఆ సినిమా రూ.రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తే తమ కుటుంబానికి కోటి రూపాయలు మాత్రమే ఇచ్చారని బబిత ఇటీవల ఓ ఇంటర్య్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దంగల్’ సక్సెస్ అయిన తర్వాత ఆమీర్‌ఖాన్ టీమ్‌ని తన తండ్రి మహావీర్ సంప్రదించారనీ, తమ గ్రామంలో అకాడెమీ నిర్మించడానికి సాయం చేయమని కోరితే, పట్టించుకోలేదని బబిత ఆరోపించారు. ‘దంగల్’ సినిమా ఎలా పుట్టిందో ఆమె వివరిస్తూ ‘చండీగఢ్‌కు చెందిన ఓ విలేకరి నాన్న గురించి, మా అక్క గీత గురించి, నా గురించి ఓ ఆర్టికల్ రాశారు. అది చదివి దర్శకుడు నితీశ్ తివారీ టీమ్ నాన్నను సంప్రదించింది. మొదట్లో మా గురించి ఓ డాక్యుమెంటీ తీస్తానని ఆయన చెప్పారు.
తర్వాత మళ్లీ ఆయనే వచ్చి డాక్యుమెంటరీ కాదు.. సినిమా తీస్తామని చెప్పారు. కథ కూడా చెప్పారు. అది విని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాం. అయితే సినిమాలో మా పేర్లు ఉండవనీ, మారుస్తున్నామనీ నితీశ్ చెప్పారు. కానీ నాన్న ఒప్పుకోలేదు.. మా పేర్లు ఉండాల్సిందేనన్నారు. ‘దంగల్’ సినిమా రిలీజ్ అయ్యాక మా ఫ్యామిలీ అంతా కలసి చూశాం. నా చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి’ అని బబిత చెప్పారు.