ఆస్ట్రేలియాలో డ్యూయెట్‌

ABN , Publish Date - Sep 23 , 2024 | 06:15 AM

నితిన్‌, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం...

నితిన్‌, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలోని ఓ కీలక షెడ్యూల్‌ ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో నితిన్‌, శ్రీలీలపై ఓ డ్యూయెట్‌ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 20న విడుదలవనుంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎడిటర్‌: కోటి, డీఓపీ: సాయి శ్రీరామ్‌, సంగీతం: జీ.వి.ప్రకాశ్‌కుమార్‌.

Updated Date - Sep 23 , 2024 | 06:15 AM