మాతృభాషలోనూ డబ్బింగ్‌

ABN , Publish Date - May 14 , 2024 | 12:20 AM

దక్షిణాది అభిమానులే కాక ఉత్తరాది ప్రేక్షకలోకం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘కల్కి 2898 ఏ.డీ’. ఇందులో ప్రభా్‌సకు జోడీగా దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే....

మాతృభాషలోనూ డబ్బింగ్‌

దక్షిణాది అభిమానులే కాక ఉత్తరాది ప్రేక్షకలోకం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘కల్కి 2898 ఏ.డీ’. ఇందులో ప్రభా్‌సకు జోడీగా దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. జూన్‌ 27న ఈ చిత్రం విడుదల కానుండడంతో చిత్ర బృందం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను వేగవంతం చేసింది. ఇటీవలే ఈ మూవీలో తన పాత్ర కోసం దీపికా డబ్బింగ్‌ మొదలుపెట్టారు. ఆ పాత్ర డబ్బింగ్‌ను హిందీలోనే కాకుండా తన మాతృభాష అయిన కన్నడలోనూ దీపికానే స్వయంగా చెప్పుకోవడం విశేషం. తన మాతృభాషలో డబ్బింగ్‌కు దీపికానే వాయిస్‌ అందించడంతో ఇది మూవీకి మరింత ప్లస్‌ కానుంది అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌కు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పటానీలతో కూడిన భారీ తారాగణం ఇందులో నటిస్తున్నారు. అశ్వినీదత్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - May 14 , 2024 | 12:21 AM