Jayaho Ramanuja: ప్రముఖుల సమక్షంలో ‘జయహో రామానుజ’ ట్రైలర్ విడుదల

ABN , Publish Date - May 28 , 2024 | 01:45 PM

లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్‌లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ, సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

Jayaho Ramanuja: ప్రముఖుల సమక్షంలో ‘జయహో రామానుజ’ ట్రైలర్ విడుదల
Jayaho Ramanuja Trailer Launch Event

లయన్ డా. సాయి వెంకట్ (Dr Lion Sai Venkat) నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’ (Jayaho Ramanuja). ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్‌లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ, సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో (Jayaho Ramanuja Trailer Launch Event)

*NTR Jayanthi: ‘భారతరత్న’.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్


దర్శకుడు, హీరో డా.లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ.. మహిళల్ని గౌరవించాలని, కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మానవాళి ఉండాలని సందేశాన్ని ఇచ్చిన గొప్ప గురువు భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారు. ఆయన గొప్పదనం ఈ తరం వారికి తెలియాలనే ఉద్దేశంతోనే ‘జయహో రామానుజ’ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ సినిమాకు పదేళ్ల క్రితమే అంకురార్పణ చేశాను. సమతామూర్తి విగ్రహాన్ని మన దగ్గర ప్రధాని, రాష్ట్రపతి వంటి పెద్ద వాళ్లు వచ్చి ఆవిష్కరించినప్పుడు తెలుగు రాష్ట్రాల వారితో పాటు ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఎవరు రామానుజాచార్యులు అని తెలియని వారు తెలుసుకోవడం ప్రారంభించారు. అన్నమయ్య సినిమా తర్వాతే ఆయన గురించి విస్తృతంగా అన్ని తరాల ప్రజలకు తెలిసింది. ఈ సినిమాతో ఆయన గొప్పదనం అందరికీ తెలియజేయాలని సంకల్పించాను. ఇవాళ మా సినిమా ట్రైలర్ లాంఛ్ చేసుకోవడం ఎందరో పెద్దలు నన్న ఆశీర్వదించేందుకు కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. జయహో రామానుజ సినిమా రూపకల్పనకు రెండేళ్ల సమయం పట్టింది. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని అన్నారు.


Ramanuja.jpg

నిర్మాత ప్రవళ్లిక (Pravallika) మాట్లాడుతూ.. భారీ స్థాయిలో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించాలనేది నాన్నగారి కల. ఆ కలను సాకారం చేయడంలో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉంది. ఈ వేదికగా నాన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఎందరో పెద్దలు వచ్చి ఆశీర్వదించడం శుభసూచకంగా భావిస్తున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణమాచార్యులు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత ఉషారాణి, దర్శకుడు రేలంగి నరసింహారావు, బీసీ కమీషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్, టీడీపీ నాయకురాలు జ్యోత్స్న, పొలిటికల్ లీడర్ వేణుగోపాలాచారి, నిర్మాత-నటుడు గురురాజ్ వంటి వారు ప్రసంగించారు.

Read Latest Cinema News

Updated Date - May 28 , 2024 | 01:48 PM