రెట్టింపు వినోదం
ABN , Publish Date - Sep 19 , 2024 | 06:52 AM
యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ‘మ్యాడ్’ చిత్రం లాస్టియర్ విడుదలై హిట్ అయింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఇందులో...
యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ‘మ్యాడ్’ చిత్రం లాస్టియర్ విడుదలై హిట్ అయింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ వస్తోంది. ఇందులోని తొలి పాటను ఈ శుక్రవారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, సంప్రదాయ దుస్తుల్లో ఉన్న మ్యాడ్ గ్యాంగ్ పోస్టర్‌ను విడుదల చేసింది ‘సితార’ సంస్థ. ఈ సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో దర్శకుడు కల్యాణ్ శంకర్ ఉన్నారు. రెట్టింపు వినోదంతో, రెట్టింపు విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటామని నిర్మాతలు హారిక సూర్యదేవర, సాయి సౌజన్య చెప్పారు. ‘మ్యాడ్’ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికీ వర్క్ చేస్తున్నారు.