రెండింతల వినోదం

ABN , Publish Date - Feb 08 , 2024 | 05:23 AM

సిద్దు జొన్నలగడ్డకు స్టార్‌ స్టేటస్‌ను తెచ్చిన చిత్రం ‘డీజే టిల్లు’. ‘అట్లుంటది మనతోని’ అంటూ ఆ సినిమాలో ఆయన పంచిన వినోదం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మరోసారి...

రెండింతల వినోదం

సిద్దు జొన్నలగడ్డకు స్టార్‌ స్టేటస్‌ను తెచ్చిన చిత్రం ‘డీజే టిల్లు’. ‘అట్లుంటది మనతోని’ అంటూ ఆ సినిమాలో ఆయన పంచిన వినోదం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మరోసారి టి ల్లూ బాయ్‌ ప్రేక్షకులను ఎంటర్టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘డీజే టిల్లు’కు సీకె ్వల్‌గా ‘టిల్లూ స్క్వేర్‌’ రూపొందుతోంది. మల్లిక్‌రామ్‌ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం సిద్ధు పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేసింది. కారులో హీరో హీరోయిన్ల రొమాన్స్‌, రాధికతో ప్రణయం గురించి టిల్లూ గుర్తు చేసుకొనే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సిద్ధు తనదైన స్టైల్లో మరోసారి డైలాగ్‌లతో మ్యాజిక్‌ చేశాడు. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. రామ్‌ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ఎస్‌ఎస్‌ థమన్‌ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సాయిప్రకాశ్‌ ఉమ్మడి సింగు. ఎడిటర్‌: నవీన్‌ నూలి

Updated Date - Feb 08 , 2024 | 05:24 AM