ప్రైమ్‌ షో కు డబుల్‌ ఇస్మార్ట్‌ హక్కులు

ABN , Publish Date - Jul 23 , 2024 | 05:54 AM

రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో మాస్‌, యాక్షన్‌, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌.. డబుల్‌ డోస్‌లో...

రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో మాస్‌, యాక్షన్‌, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌.. డబుల్‌ డోస్‌లో ఉంటాయంటున్నారు దర్శకుడు పూరి. తాజా సమాచారం ఏమిటంటే.. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల వరల్డ్‌ థియేట్రికల్‌ రైట్స్‌ ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేతలు నిరంజన్‌ రెడ్డి, చైతన్యరెడ్డి సొంతం చేసుకున్నారు. సంజయ్‌దత్‌ ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ పోషించిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో కావ్య థాపర్‌ కథానాయిక. పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ నిర్మాతలు.

Updated Date - Jul 23 , 2024 | 05:54 AM