డబుల్... కిక్ ఇచ్చింది
ABN , Publish Date - Aug 05 , 2024 | 06:22 AM
‘కమర్షియల్ సినిమా అంటే గుర్తుకొచ్చేది పూరి జగన్నాథ్. ఆయన ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఎక్కువ సమయం, కష్టం పెట్టిన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. స్ర్కిప్ట్ విన్నప్పుడు ఎంత కిక్ వచ్చిందో, ఇస్మార్ట్ శంకర్ పాత్రలో...
‘కమర్షియల్ సినిమా అంటే గుర్తుకొచ్చేది పూరి జగన్నాథ్. ఆయన ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఎక్కువ సమయం, కష్టం పెట్టిన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. స్ర్కిప్ట్ విన్నప్పుడు ఎంత కిక్ వచ్చిందో, ఇస్మార్ట్ శంకర్ పాత్రలో నటిస్తున్నప్పడూ అంతే కిక్ ఇచ్చింది. త్వరలో థియేటర్లలో కలుద్దాం’ అని హీరో రామ్ పోతినేని అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని ఆదివారం వైజాగ్‌లో నిర్వహించారు. పూరి జగన్నాథ్ వీడియో సందేశంలో మాట్లాడుతూ ‘వైజాగ్ గల్లీల్లో తిరిగినవాణ్ణి. నేను తీసిన గల్లీ సినిమా ఇది. సీ సెంటర్లలో విజిల్స్ వేస్తూ చూడండి’ అని ప్రేక్షకులను కోరారు. థియేటర్‌కి పట్టిన తుప్పును వదలగొట్టే సినిమా ఇదని అలీ అన్నారు. ఒక మంచి చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని హీరోయిన్ కావ్యథాపర్ చెప్పారు.