డబుల్‌ ఫన్‌..థ్రిల్‌

ABN , Publish Date - Aug 31 , 2024 | 05:59 AM

విజయం సాధించిన ‘మత్తు వదలరా’ చిత్రానికి సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’ వస్తోంది. శ్రీసింహా కోడూరి లీడ్‌ రోల్‌లో, సత్య సైడ్‌ కిక్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రితేశ్‌ రానా దర్శకుడు. మైత్రీ మూవీస్‌ సమర్పణలో

విజయం సాధించిన ‘మత్తు వదలరా’ చిత్రానికి సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’ వస్తోంది. శ్రీసింహా కోడూరి లీడ్‌ రోల్‌లో, సత్య సైడ్‌ కిక్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రితేశ్‌ రానా దర్శకుడు. మైత్రీ మూవీస్‌ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, సునీల్‌, అజయ్‌, రోహిణి ఇతర ముఖ్య పాత్రధారులు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన అనంతరం హీరో శ్రీసింహా మాట్లాడుతూ ‘డబుల్‌ ఫన్‌, థ్రిల్‌ ఉండేలా సెకండ్‌ పార్ట్‌ చేశాం. సెప్టెంబర్‌ 13న విడుదలవుతుంది’ అని చెప్పారు. ఫస్ట్‌ పార్ట్‌లోనే ఒక ఐడియాను ప్లాంట్‌ చేసి దాని నుంచి డైరెక్ట్‌గా సీక్వెల్‌ చేశామని దర్శకుడు చెప్పారు.

Updated Date - Aug 31 , 2024 | 05:59 AM