డబుల్‌ ఎంటర్టైన్‌మెంట్‌ గ్యారంటీ

ABN , Publish Date - May 13 , 2024 | 12:11 AM

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌‘ సినిమాలో నటిస్తున్నారు. ఇది 2019లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ను...

డబుల్‌ ఎంటర్టైన్‌మెంట్‌ గ్యారంటీ

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌‘ సినిమాలో నటిస్తున్నారు. ఇది 2019లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ను అందుకున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్‌డేట్‌ వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 15న రామ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తోంది. ఈ టీజర్‌తో డబుల్‌ మాస్‌, డబుల్‌ ఎంటర్టైన్‌మెంట్‌ గ్యారంటీ అని టీజర్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ పవర్‌ ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: పూరి జగన్నాథ్‌, చార్మి కౌర్‌, సినిమాటోగ్రాఫర్‌: సామ్‌ కె నాయుడు, జియాని జియన్నెలి, సంగీతం: మణిశర్మ.

Updated Date - May 13 , 2024 | 12:11 AM