డబుల్‌ డోస్‌... దిమాకీ కిరికిరి

ABN , Publish Date - May 16 , 2024 | 05:27 AM

రామ్‌ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. హీరో పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు...

డబుల్‌ డోస్‌... దిమాకీ కిరికిరి

రామ్‌ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. హీరో పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘దిమాకీ కిరికిరి’ పేరుతో టీజర్‌ విడుదల చేశారు. ఇందులో రామ్‌ ఇస్మార్ట్‌ నెస్‌, కావ్యా థాపర్‌ పరిచయం, సంజయ్‌దత్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ అలరించాయి. అద్భుత శివలింగం, క్లైమాక్స్‌ ఫైట్‌ .. భారీ జనసమూహం కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో కూడా స్పిర్చువల్‌ టచ్‌ ఉంటుందని హింట్‌ ఇచ్చారు దర్శకుడు పూరి. హైదరాబాద్‌ యాసలో రామ్‌ చెప్పే డైలాగులు, మాస్‌ యాక్షన్‌ ఫ్యాక్డ్‌ అవతార్‌ అలరించాయి. డబుల్‌ ఎనర్జీ, డబుల్‌ ఫన్‌తో ఈ సినిమా ఉంటుందని టీజర్‌ చూడగానే అర్ధమవుతుంది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాల, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - May 16 , 2024 | 05:27 AM