డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Mar 30 , 2024 | 04:44 AM

విష్వక్‌సేన్‌ తన పుట్టినరోజు సందర్భంగా రెండు ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్స్‌కు సైన్‌ చేశారు. పదో చిత్రానికి ‘మెకానిక్‌ రాకీ’ అనే పేరు నిర్ణయించారు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు...

డబుల్‌ ధమాకా

విష్వక్‌సేన్‌ తన పుట్టినరోజు సందర్భంగా రెండు ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్స్‌కు సైన్‌ చేశారు. పదో చిత్రానికి ‘మెకానిక్‌ రాకీ’ అనే పేరు నిర్ణయించారు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు.

రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘లైలా’

విష్వక్‌ తన 12వ చిత్రం కోసం దర్శకుడు రామ్‌నారాయణ్‌తో చేతులు కలిపారు. నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రానికి నిర్మాత. ‘లైలా’ అని పేరు పెట్టినట్లు వెల్లడిస్తూ టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

Updated Date - Mar 30 , 2024 | 04:44 AM