కాలరెత్తి తిరగరా...

ABN, Publish Date - Jul 29 , 2024 | 04:10 AM

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. మీనాక్షి చౌదరి కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 7న విడుదలవుతోంది...

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. మీనాక్షి చౌదరి కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 7న విడుదలవుతోంది. ఆదివారం దుల్కర్‌ సల్మాన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ‘లక్కీ భాస్కర్‌’ టైటిల్‌ ట్రాక్‌ను విడుదల చేసింది. ‘శభాష్‌ సోదరా...కాలరెత్తి తిరగరా...కరెన్సీ దేవి నిను వరించెరా’ అంటూ సాగే ఈ గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ స్వరాలందించారు.

ఆకాశంలో ఒక తార

పవన్‌ సాధినేని దర్శకత్వంలో దుల్కర్‌ కథానాయకుడిగా నటించబోయే కొత్త చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాకు ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గీతా ఆర్ట్స్‌, స్వప్న సినిమా, లైట్‌ బాక్స్‌ మీడియా సమర్పణలో సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో రైతు లుక్‌లో దుల్కర్‌ కనిపించారు. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

Updated Date - Jul 29 , 2024 | 04:10 AM