తప్పని తెలిసినా చేయక తప్పదు

ABN , Publish Date - May 17 , 2024 | 02:35 AM

కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నింద’. వరుణ్‌ సందేశ్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని రాజేశ్‌ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో...

తప్పని తెలిసినా చేయక తప్పదు

కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నింద’. వరుణ్‌ సందేశ్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని రాజేశ్‌ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను నటుడు నవీన్‌చంద్ర రిలీజ్‌ చేసి, యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ‘జీవితంలో కొన్నిసార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’ అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్‌లో ఎన్నో కోణాలు ఉన్నాయి. ప్రేమకథతో పాటు మర్డర్‌ మిస్టరీ అంశాలు ఉన్నట్లు కనిపించింది. టీజర్‌లో విజువల్స్‌ సహజంగా ఉన్నాయి. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను ఫీల్‌ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోందనీ, త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామనీ నిర్మాత చెప్పారు. ఆనీ చిత్రంలో కథానాయికగా నటించింది.

Updated Date - May 17 , 2024 | 02:35 AM