ఐటమ్ సాంగ్ చేస్తుందా?
ABN , Publish Date - Aug 23 , 2024 | 06:28 AM
నటి శోభితా ధూళిపాళకు ఇటీవలే నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అమ్మడును ఓ క్రేజీ ఆఫర్ వచ్చి తలుపు తట్టింది. ఫర్హాన్
నటి శోభితా ధూళిపాళకు ఇటీవలే నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అమ్మడును ఓ క్రేజీ ఆఫర్ వచ్చి తలుపు తట్టింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్, కియారా అడ్వానీ జంటగా తెరకెక్కనున్న ‘డాన్ 3’లో ఓ ప్రత్యేక గీతంలో నటించడానికి శోభితను మేకర్స్ సంప్రదించారట. దానికి శోభిత సమ్మతించారని కొందరు, అదేంకాదు ఇంకా చర్చల్లోనే ఉందని మరికొందరు అంటున్నారు. మరి శోభిత నిజంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.. లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఆమె నిర్ణయం కోసం ఆ చిత్ర దర్శక నిర్మాతలే కాదు, అక్కినేని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.