ఆ సెంటిమెంట్‌ ఫాలో అవుతున్నా

ABN, Publish Date - Oct 04 , 2024 | 01:24 AM

‘గతంలో ‘హ్యాపీడేస్‌’, ‘శతమానం భవతి’ చిత్రాలను ఓవర్సీ్‌సలో ముందుగా రిలీజ్‌ చేశాను. ఆ సెంటిమెంట్‌తోనే ‘జనక అయితే గనక’ సినిమాను ముందుగానే అంటే ఈ నెల 10న ఓవర్సీ్‌సలో...

‘గతంలో ‘హ్యాపీడేస్‌’, ‘శతమానం భవతి’ చిత్రాలను ఓవర్సీ్‌సలో ముందుగా రిలీజ్‌ చేశాను. ఆ సెంటిమెంట్‌తోనే ‘జనక అయితే గనక’ సినిమాను ముందుగానే అంటే ఈ నెల 10న ఓవర్సీ్‌సలో విడుదల చేస్తున్నాం. 12న ఇక్కడ రిలీజ్‌ చేస్తాం’ అని చెప్పారు దిల్‌ రాజు. సుహాస్‌, సంగీర్తన జంటగా నటించిన ‘జనక అయితే గనక’ చిత్రాన్ని సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వంలో దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘ఇప్పటికే చాలా మందికి సినిమా చూపించాం. పూర్తి వినోదభరితంగా ఉంటుంది. అందరినీ అలరించే సినిమా అవుతుంది’ అన్నారు. హీరో సుహాస్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఎవరినీ నిరాశ పరచదు. చూసిన వాళ్లు బాగుందని చెబుతున్నారు. ఆడియన్స్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందా అని అక్టోబర్‌ 12 కోసం వెయిట్‌ చేస్తున్నా’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హర్షిత్‌రెడ్డి, సంగీర్తన, సందీ్‌పరెడ్డి కూడా పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2024 | 01:24 AM