రేఖ ఆస్తుల వివరాలు తెలుసా?

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:56 AM

బాలీవుడ్‌కి వెళ్లి సత్తా చాటిన తొలి తెలుగు హీరోయిన్‌ రేఖ. ఇప్పటివరకూ దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారామె. రేఖ కెమెరా ముందుకు వచ్చి పదేళ్లు అవుతోంది. ముందే జాగ్రత్త పడి, ఆస్తులు...

రేఖ ఆస్తుల వివరాలు తెలుసా?

బాలీవుడ్‌కి వెళ్లి సత్తా చాటిన తొలి తెలుగు హీరోయిన్‌ రేఖ. ఇప్పటివరకూ దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారామె. రేఖ కెమెరా ముందుకు వచ్చి పదేళ్లు అవుతోంది. ముందే జాగ్రత్త పడి, ఆస్తులు సంపాదించుకోకపోతే ఆర్టిస్టుల చివరి రోజులు ఎంత దుర్భరంగా గడుస్తాయో చెప్పనక్కర్లేదు. తన పిన్ని, మహానటి సావిత్రిలా తన జీవితం కష్టాల మయం కాకూడదని రేఖ అనుకున్నారో ఏమో కానీ దీపం ఉండగానే అన్నీ చక్కదిద్దుకున్నారు. ప్రస్తుతం ఆమెకు సినిమా నుంచి సంపాదన ఏమీ లేకపోయినా ఆస్తులకు కొదవలేదు. ప్రస్తుతం ముంబై రేఖ ఉంటున్న ఇంటి ఖరీదు ఎంతో తెలుసా.. అక్షరాలా రూ. వంద కోట్లు. ఇక నెల నెలా అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు వచ్చి ఆమె అకౌంట్‌లో పడుతుంటాయి.


బ్యాంక్‌లో ఉన్న ఫిక్సెడ్‌ డిపాజిట్ల సంగతి చెప్పనక్కర్లేదు. కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు అనవసరపు ఖర్చుల జోలికి పోకుండా తన సంపాదనలో అధిక శాతం ఫిక్సెడ్‌ డిపాజిట్లలో దాచుకున్నారు రేఖ. ఆమె ఇంట్లో మందీ మార్బలం కూడా పెద్దగా లేరు. ఒక సెక్రటరీ, డ్రైవర్‌ తప్ప. వీళ్లిద్దరూ చాలా ఏళ్లుగా ఆమె దగ్గర పని చేస్తున్నారు.

Updated Date - Jun 29 , 2024 | 03:56 AM