విడాకులు మంజూరు
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:58 AM
తమిళ హీరో ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ చట్టపరంగా విడిపోయారు. ఈ దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ చెన్నై ఫ్యామిలీ కోర్టు బుధవారం
తమిళ హీరో ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ చట్టపరంగా విడిపోయారు. ఈ దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ చెన్నై ఫ్యామిలీ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. దీంతో వీరిద్దరి రెండు దశాబ్దాల వివాహ బంఽధం ముగిసిపోయినట్లయింది. 2004లో వీరిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరికివేద్, లింగా అనే ఇద్దరు మగ పిల్లలున్నారు. అయితే, మనస్పర్థల కారణంగా తాము విడిపోతున్నట్టు వారు 2022లో ప్రకటించారు. ఆరు నెలల క్రితం ధనుష్ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో వీరిద్దరూ మళ్ళీ ఒక్కటవుతారని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా ఈ నెల 21వ తేదీన కోర్టుకు హాజరై విడాకులు మంజూరు చేయాలని అభ్యర్థించారు. వారిద్దరిఏకాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి శుభాదేవి తుది తీర్పును 27వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు బుధవారం వారికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)