రాధికకు విశిష్ట మహిళా పురస్కారం

ABN , Publish Date - Mar 08 , 2024 | 02:32 AM

సీనియర్‌ నటి రాధికకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 2024 విశిష్ట మహిళ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాధికను సన్మానించి...

రాధికకు విశిష్ట మహిళా పురస్కారం

సీనియర్‌ నటి రాధికకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 2024 విశిష్ట మహిళ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాధికను సన్మానించి పురస్కారం ప్రదానం చేస్తామని వర్సిటీ రిజిస్ర్టార్‌ ఆచార్య బి.కరుణ గురువారం తెలిపారు. మంచి నటిగానే కాకుండా నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్న రాధిక తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బుల్లి తెరపై కూడా రాణిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి, పెదకాకాని

Updated Date - Mar 08 , 2024 | 10:37 AM