డర్టీఫెలోకు ఛాయిస్‌ లేదు

ABN , Publish Date - May 22 , 2024 | 12:47 AM

శాంతి చంద్ర, దీపిక సింగ్‌, సిమ్రిత్‌, నికిష రంగ్‌వాలా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. అడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. శాంతిబాబు నిర్మించారు...

డర్టీఫెలోకు ఛాయిస్‌ లేదు

శాంతి చంద్ర, దీపిక సింగ్‌, సిమ్రిత్‌, నికిష రంగ్‌వాలా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. అడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. శాంతిబాబు నిర్మించారు. ఈ నెల 24న విడుదలవుతోన్న సందర్భంగా సోమవారం చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సంపూర్ణేశ్‌బాబు మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ‘డర్టీఫెలో’ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారు అని శాంతిచంద్రను అడిగాను. ‘ఈ కథకు ఆ టైటిల్‌ తప్ప మరో ఛాయిస్‌ లేద’ని ఆయన చెప్పారు. మంచి కథతో వస్తున్న చిత్రమిది’ అన్నారు. శాంతి చంద్ర మాట్లాడుతూ ‘ఎప్పటికైనా హీరో కావాలనుకున్నాను. అది ‘మంత్ర’ చిత్రంతో నెరవేరింది. ఆ తర్వాత బిజినెస్‌ పనులతో గ్యాప్‌ వచ్చింది.


మళ్లీ ‘డర్టీఫెలో’ కథ న చ్చడంతో నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాను. ఎమోషన్‌, యాక్షన్‌, రొమాన్స్‌, ఫ్యామిలీ డ్రామా లాంటి అన్ని హంగులు ఉన్న చిత్రమిది’ అన్నారు. అడారి మూర్తి సాయి మాట్లాడుతూ ‘సినిమాను థియేటర్‌లోనే చూడండి. చిన్న సినిమాలను బతికించండి. చిత్రబృందం అంతా ఒకే కుటుంబంలా కలసి పనిచేశాం. కథా బలమున్న చిత్రమిది’ అన్నారు.

Updated Date - May 22 , 2024 | 12:47 AM